![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-8 సూపర్ ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సాగుతుంది. హౌస్ లో పదకొండవ వారం మొదలైంది. సోమవారం రానే వచ్చింది. బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న నామినేషన్ ప్రక్రియతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు రాజేసుకుంది. టేస్టీ తేజ గత వారం చేసిన ఒకే ఒక మిస్టేక్ తో కన్నడ బ్యాచ్ టార్గెట్ చేశారు.
ఈ సారి నామినేషన్ ప్రక్రియ డిఫరెంట్ గా జరిగింది. యాక్షన్ రూమ్ లో హౌసెమేట్స్ ఫొటోస్ ఉంటాయి. బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలో ఉన్న బ్రష్ ఎవరు పట్టుకుంటే వాళ్ళు నామినేట్ చెయ్యాలనుకున్న వారి ఫోటోకి కలర్ వెయ్యాలి. దాంతో నిఖిల్, తేజని నామినెటే చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ టాస్క్ లో నువ్వు చేసింది తప్పు.. నీకు తప్పు అని తెలిసిన కూడ చేసావని నిఖిల్ రీజన్ చెప్తాడు. నాకు ముందు తెలియదు ఆ తర్వాత తప్పని తెలిసింది ఒప్పుకున్న నేను చేసింది తప్పు అయితే.. యష్మీ చేసింది కూడా తప్పే అని తేజ అనగానే.. అది నాకు తెలియదని నిఖిల్ అంటాడు. భయపడుతున్నావని తేజ అంటాడు. ఆ రోజు నన్ను ముగ్గురు ఎటాక్ చేసి అడిగారు కదా అని తేజ అనగానే.. ముగ్గురు ఎవరు పేర్లు చెప్పే దమ్ము లేదంటు పృథ్వీ రెచ్చి పోయి తేజపై మీద మీదకి వెళ్తాడు. దమ్ము లాంటి మాటలు మాట్లాడకని పృథ్వీతో తేజ అంటాడు.
ఆ తర్వాత తేజ యష్మీని తేజ నామినేట్ చేస్తాడు. ఆ రోజు నిఖిల్ కి సపోర్ట్ చేసావ్. మళ్ళీ రోహిణి, నబీల్, నిఖిల్ లు శనివారం నాటి ఎపిసోడ్ లో షీల్డ్ కోసం నిల్చున్నప్పుడు నబీల్ కి సపోర్ట్ చేసావ్.. అదే ముందు చేసి ఉంటే ఇదంతా అయ్యేది కాదని తేజ అంటాడు. ఆ తర్వాత తేజని యష్మీ ఇమిటేట్ చేస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది కానీ తేజ మాత్రం ఏం తగ్గకుండా మాట్లాడతాడు. ఆ తర్వాత అవినాష్, రోహిణి, నబీల్ గౌతమ్ కలిసి మాట్లాడుకుంటారు వాళ్ళు కావాలనే ఒక మాటని మళ్ళీ మళ్ళీ అంటూ తేజని రెచ్చగొడుతున్నారని అవినాష్ అంటాడు. వీళ్ళకి కన్నడ బ్యాచ్ అంతా కలిసే ఆడుతున్నారని అర్థమైంది.
![]() |
![]() |